ఆస్టిన్ హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ లో ‘‘మహా రుద్రం 2026’’
అమెరికాలోని ఆస్టిన్ హిందూ టెంపుల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో ‘‘మహారుద్రం 2026’’ నిర్వహించడానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు నడుస్తున్నాయి. వచ్చే నెల నవంబర్ 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది.
మొదటి రోజు (శనివారం, నవంబర్ 21): ఉదయం 7:00 గంటలకు శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహా సంకల్పంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, జ్యోతిర్లింగార్చన తదితర విశేష పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 8:00 గంటలకు మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణతో తొలి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి.
రెండో రోజు (ఆదివారం, నవంబర్ 22): ఉదయం 10:30 గంటలకు దశమ మహా రుద్ర హోమం, మహా పూర్ణాహుతి జరగనుంది. మధ్యాహ్నం 12:00 గంటలకు కలశ శంఖ మహా రుద్రాభిషేకం, తదుపరి రుద్ర త్రిశతి అర్చన, వేద ఆగామ స్వస్తివచనం మరియు తీర్థ ప్రసాదాలతో ఈ పవిత్ర మహోత్సవం పూర్తవుతుంది.
ఇక.. ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరైనా స్పాన్సర్లుగా అవ్వాలంటే దానికి సంబంధించిన వివరాలను కూడా నిర్వాహకులు ప్రకటించారు.
గ్రాండ్ స్పాన్సర్షిప్: $1116
2 రోజుల ద్రవ్యమ్స్ స్పాన్సర్షిప్: $501
1 రోజు: $251
అభిషేకం / హోమం: ప్రతి ఒక్కటి $101
అన్నదానం: $251
అర్చన: $21
మరిన్నివివరాల కోసం ఫిల్లర్ లో వున్న స్కానర్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్, స్పాన్సర్ షిప్ కోసం…
Registration & Sponsorship:*\
[https://www.cognitoforms.com/AustinHinduTemple1/MahaRudram](https://www.cognitoforms.com/AustinHinduTemple1/MahaRudram)








