వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపండి… అమిత్ షాకు చంద్రబాబు లేఖ
* అమరావతి-
* ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సీఎం చంద్రబాబు
*
* తఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్న సీఎం
* త్వరితగతిన తుఫాను నష్టం పై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ముఖ్యమంత్రి
* తుఫాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించినట్టు స్పష్టం
* తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడి
* ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని సీఎం వెల్లడి
* ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని తెలిపిన సీఎం
* తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో వెల్లడి
* విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు తెలిపిన ముఖ్యమంత్రి
* భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంటకు నీట మునిగినట్టు లేఖలో తెలిపిన సీఎం
* ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపిన ముఖ్యమంత్రి
* కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని స్పష్టం
* అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపిన సీఎం
* ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని లేఖలో పేర్కొన్న సీఎం
* తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని సీఎం వెల్లడి
* తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి
* నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను కోరిన సీఎం చంద్రబాబు
* ఆంధ్రప్రదేశ్ కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసిన సీఎం








