లివర్ మోర్ లోని శివ విష్ణు టెంపుల్ లో ‘‘‘‘శ్రీ రామ షడాక్షరీ మహాయజ్ఞం’’
లివర్ మోర్ లోని హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ లో వున్న శివ విష్ణు టెంపుల్ లో ‘‘శ్రీ రామ షడాక్షరీ మహాయజ్ఞం, శ్రీ రామ పరివార ఉత్సవ మూర్తి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 22 వ తేదీ నుంచి అక్టోబర్ 25 వ తేదీ వరకూ ఈ కార్యక్రమంగా అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
అక్టోబర్ 22 వ తేదీన మొదలయ్యే ఈ కార్యక్రమంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్పం, దీక్ష, అజస్ర దీపం, భూమిపూజ, అంకురార్పణం, యాగశాల వస్తు, కలఅపకార్షణమ్, హారతి, తీర్థప్రసాద వితరణ వుంటుంది.
అక్టోబర్ 23 వ తేదీన…
శివ, బాలాజీ సుప్రభాతం
శివ, పార్వతీ, దశభుజ దుర్గ, లక్ష్మీ, అండాళ్ అభిషేకం
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం
యాగశాల ప్రవేశం
ద్వారపూజ, యాగశాల ధ్వజారోహణం
అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభ పూజ, నిత్యహోమం
శ్రీ రామ షడాక్షరీ హోమ
లఘు పూర్ణాహుతి, హారతి, తీర్థప్రసాదం
కుంభ పూజ, నిత్య హోమం
క్షీర అధివాసం
ప్రదోష పూజ అభిషేకం, రెండో కలం హోమం
ప్రదోష శివ అభిషేకం,
లఘు పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాదం
అక్టోబర్ 24 వ తేదీన కార్యక్రమాలు
శివ, విష్ణు సుప్రభాతం
శివ, బాలాజీ, నవగ్రహ, హనుమాన్ అభిషేకం
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కుంభ పూజ
జలాధివాసం
మూడో కలమ్ హోమ
కార్య సిద్ధి హనుమాన్ పూజ
లఘు పూర్ణాహుతి, హారతి,
తీర్థ ప్రసాదం
కర్మాంగ స్నపనం, నేత్రోన్మీలనం
నాలుగో కలమ్ హోమ
శయనాధివాసం
మూర్తి హోమం
లఘు పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణ
శివ హారతి, బాలాజీ హారతి
అక్టోబర్ 25 వ తేదీ కార్యక్రమాలు
శివ, బాలాజీ సుప్రభాతం
శివ, గణేష, కార్తికేయ, కనకదుర్గ, కాలభైరవ అభిషేకం
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కుంభ పూజ
ఐదో కలమ్ హోమం
మహా పూర్ణాహుతి ప్రదక్షిణమ్
మహా పూర్ణాహుతి
కుంభ ప్రదక్షిణం
కళా ఆహ్వానమ్ ఉత్సవమూర్తుల్లోకి
మంగళ దర్శనం, ప్రథమ అర్చన, మహా నైవేద్యం, హారతి, తీర్థ ప్రసాద వితరణ
శ్రీ సీతా రామ కల్యాణం
ఇక ఈ కార్యక్రమం సందర్భంగా స్పాన్సర్స్ అయ్యే అవకాశాన్ని కూడా దేవస్థానం వారు కల్పించారు. దాని వివరాలు ఇలా వున్నాయి.
శ్రీ రామ షడాక్షరీ మహా యజ్ఞం ఒక కలమ్ స్పాన్సర్ షిప్ అయితే 116+ డాలర్లు
శ్రీ రామ షడాక్షరీ మహా యజ్ఞం ఒక కలమ్, ఫ్లవర్ స్పాన్సర్ షిప్ – 310+ డాలర్లు
శ్రీ రామ షడాక్షరీ మహా యజ్ఞం – ఒక రోజు స్పాన్సర్ షిప్ – 501+ డాలర్లు
శ్రీ రామ షడాక్షరీ మహా యజ్ఞం ఒక కలమ్ ఈవెంట్ స్పాన్సర్, రామ విగ్రహానికి అయితే 1116+ డాలర్లు
Sri Rama Shadakshari Maha Yagnam – Event Sponsorship with Lord Rama vigraha Samprokshana – Silver Sponsorship అయితే 2501+ డాలర్లు
Sri Rama Shadakshari Maha Yagnam – Event Sponsorship with Lord Rama vigraha Samprokshana – Gold Sponsorship అయితే 5001+ డాలర్లు
Sri Rama Shadakshari Maha Yagnam – Event Sponsorship with Lord Rama and goddess Sita vigrahas Samprokshana – Platinum Sponsorship 10,001+ డాలర్లు
Sri Rama Shadakshari Maha Yagnam – Event Sponsorship with Lord Rama Parivar vigrahas Samprokshana – Platinum Plus Sponsorship అయితే 25,001+ డాలర్లు గా దేవస్థానం నిర్ణయించింది.
మరిన్ని వివరాలకు 925-449- 6255 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.
ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరై, ఈశ్వరుని కృపాకటాక్షాలను పొందుదాం.








