దసరా శుభాకాంక్షలు తెలిపిన శాన్ ఆంటోనియో తెలుగు సంఘం
శాన్ ఆంటోనియో తెలుగు సంఘం వారు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని దహనం చేయడమే దసరా కాదు మనలోని అహంకారాన్ని భయాన్ని అసూయను జయించి మనలోని మంచితనానికి పట్టాభిషేకం చేయడమే నిజమైన విజయదశమి అని పేర్కొన్నారు. ఈ విజయదశమి మీలోని భయాలకు ముగింపు పలికి విజయాలకు నాంది కావాలని ,మీ ప్రతిరోజు ఆనందంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. చివరగా అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు శాన్ ఆంటోనియో తెలుగు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 1 న దసరా, దీపావళి సంబరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ప్రతినిధులు తెలిపారు. SHRINE AUDITORIUM 901 N LOOP 1604 W, SAN ANTONO TX 78232 వేదికగా ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు ప్రముఖ సింగర్ కోటీ, వారి బృందం కూడా హాజరుకానుంది. ఈ సందర్భంగా వారితో కార్యక్రమాలు కూడా వుంటాయి. ఈ కార్యక్రమానికి మీరు, మీ కుటుంబ సభ్యులందరూ హాజరై, విజయవంతం చేయగలరు.








