ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విజయదశమి శుభాకాంక్షలు ( Vijayadashami wishes ) తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా అని పేర్కొన్నారు. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళల (Womens)కు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కనకదుర్గమ్మ (Kanakadurgamma) ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.








