మిజోరం సీఎం లాల్దుహోమాతో మంత్రి లోకేష్ భేటీ
అమరావతి: మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమాతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన లాల్దుహోమాకు ఈ ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం లాల్దుహోమాతో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం లాల్దుహోమాను శాలువాతో సత్కరించి యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు.








