ఫిలడెల్ఫియాలో సూపర్ దీపావళి జరిపేందుకు హైఫ్ ఫెస్టివల్ సన్నాహాలు
హైఫ్ ఫెస్టివల్ సంస్థ వారు ఫిలడెల్ఫియాలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్ – దివాలీ 2026′ (Heritage India Festival – Diwali 2026) పేరుతో అట్టహాసంగా జరిపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ యేడాది దీపావళి వేడుకలు మరింత వైభవంగా, ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి ప్రవాస భారతీయులకు ఇదో అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
అమెరికా వ్యాప్తంగా ఉ న్న ప్రముఖ వ్యాపారుల నుండి సేకరించిన ఉత్పత్తులతో ఏకంగా 200లకు పైగా విభిన్న స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వ తేదీ వరకూ జరగనుంది.
మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం ప్రత్యేకమైన పండుగ దుస్తులు, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు, గృహ అలంకరణ సామగ్రి, అలానే అసలు మరియు ఇమిటేషన్ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి.
దక్షిణ ఆసియాలోని వివిధ మూలల నుండి రుచికరమైన వంటకాలను అందించే టాప్ రెస్టారెంట్లు మరియు ఫుడ్ స్టాల్స్ ఆహార ప్రియులను అలరించనున్నాయి.
ఫిలడెల్ఫియాలోనే అతిపెద్ద దీపావళి షాపింగ్ వేడుకగా ఇది నిలవనుంది. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించబడింది. అంతేకాకుండా, 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ hifestival.com ను సందర్శించండి. ఈ దీపావళికి కుటుంబ సమేతంగా తరలివచ్చి, మన సంస్కృతి సంప్రదాయాల నడుమ సరికొత్త షాపింగ్ మరియు విందు అనుభూతిని సొంతం చేసుకుందాం.
కార్యక్రమ వివరాలు…
-
తేదీలు: అక్టోబర్ 31 నుండి నవంబర్ 1, 2026 వరకు.
-
స్థలం: గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, హాల్ సి (Greater Philadelphia Expo Center, Hall C), 100 స్టేషన్ ఏవ్న్యూ, ఓక్స్, PA 19456.








