నెగెటివ్ టాక్‌ను అధిగమించి.. బాక్సాఫీస్ వద్ద రణబాలి జోరు!
విజయ్ దేవరకొండ(Vijay devarakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) జంటగా నటించిన రణబాలి(Ranabaali) బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. శనివారం కలెక్షన్లలో పెరుగుదల కనిపించగా, ఆదివారం మరింత పుంజుకుంది. సినిమాపై మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఆడియన్స్ ఆదరణతో తెలుగు రాష్ట్రాల్లో రణబాలి మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ముఖ్యంగా దసరా సెలవులు సినిమాకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ కలెక్షన్లు నిలకడగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా సెకండాఫ్ లో నెమ్మదించిన స్క్రీన్‌ప్లే ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సినిమా సాధిస్తున్న కలెక్షన్లు టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాల కలెక్షన్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండగా, రణబాలి మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. సెలవుల నేపథ్యంలో ఈ సినిమా మరింత మెరుగైన కలెక్షన్లు సాధిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు, సినిమా సక్సెస్‌ను ఆడియన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. విజయవాడలో నిర్వహించిన సక్సెస్ మీట్ తర్వాత, సోమవారం హైదరాబాద్‌లోని పలు థియేటర్లను సందర్శించి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. రాహుల్ సాంకృత్యన్(Rahul sankrityan) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించింది. రానున్న రోజుల్లో సినిమా కలెక్షన్లు ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.








