రాజమౌళిని మెప్పించిన రామాయణ ట్రైలర్!
ఇండియన్ సినీ హిస్టరీలో అత్యంత ప్రిస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న రామాయణ(ramayana) సినిమాకు ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) నుంచి ప్రశంసలు లభించాయి. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌పై ఆయన రెస్పాన్స్ అవుతూ, మేకర్స్ కు అభినందనలు తెలిపారు. ఇండియన్ డైరెక్టర్లంతా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో చెప్పాలని కోరుకునే గొప్ప ఇతిహాసం రామాయణమని పేర్కొన్న రాజమౌళి(rajamouli).. ఇంతటి భారీ స్థాయిలో ఈ కథను వెండితెరపై ఆవిష్కరించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది.
డైరెక్టర్ నితేశ్ తివారీ(Nitesh tiwari) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా(namith malhotra), యష్(Yash) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor), సాయిపల్లవి(Sai pallavi), యష్, సన్నీ డియోల్(Sunny deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ పురాణ ఇతిహాసంలోని చిరస్మరణీయ పాత్రలకు మోడ్రన్ టెక్నాలజీని జోడిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే రిలీజైన కంటెంట్ తెలియచేస్తోంది.
ఈ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ మ్యూజిక్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman), హాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్(Hans zimmer) కలిసి ఈ సినిమాను స్వరాలు సమకూరుస్తున్నారు. కథ, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల కలయికతో రామాయణపై అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి సినీ అనుభూతిని అందిస్తుందో చూడాలి.








