“మా ఊరి సీతయ్య” సినిమా పోస్టర్లు విడుదల.. ఆకట్టుకుంటున్న గ్రామీణ నేపథ్య లుక్స్!
లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ పతాకంపై జానర్ధన్ శివలెంకి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మా ఊరి సీతయ్య”. ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదల కాగా, సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
పోస్టర్ల విశేషాలు , సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: బాశ్యం కావ్య, నిత్య సహస్ర పౌర్ణమి.
సంగీత దర్శకుడు: ఎస్. రాజ్ కిరణ్.
రచయితలు: నాకొత రవి కుమార్, యర్రభతిన మునేంద్ర, మిరాకిల్ మీరా, పొలకం వెంకట సుకుమార్.
సినిమాటోగ్రఫీ (D.O.P): రాజేష్ మేడిశెట్టి.
క్రియేటివ్ హెడ్: షేక్ షంసుద్దీన్.
ఎడిటర్: అలతోరి రాజేష్ (లయ అద్భుత్ స్టూడియోస్).
స్టంట్స్ మాస్టర్స్: కిరణ్ (నెల్లూరు కుర్రాళ్ళు), వేగూరు ఆదినారాయణ.
ఈ చిత్ర పోస్టర్లలో పల్లెటూరి వాతావరణం, గ్రామీణ రాజకీయాలు , భావోద్వేగాలతో కూడిన పాత్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “అక్షరం ఒక ఆయుధం” , “జన్మించిన నేల కోసం బ్రతికే హృదయం” వంటి ఆకట్టుకునే క్యాప్షన్లతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.








