MATA ఆధ్వర్యంలో అక్టోబర్ 17 న బతుకమ్మ, దసరా సంబరాలు
మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA)ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆడపడుచులందరూ ఒకచోట చేరి, బతుకమ్మను ఆడటం మనం చూస్తూనే వుంటాం. అలాగే న్యూజెర్సీలో ‘‘మన అమెరికా తెలుగు అసోసియేషన్’’ ఆధ్వర్యంలో కూడా ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 17 వ తేదీన ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ వైభవోపేతంగా జరుగుతాయి. Royal Albert’s Palace 1050 king georges post rd, fords, NJ 08863 లో జరగనున్నాయి.
ఈ కార్యక్రమాల సందర్భంగా నిర్వాహకులు దుర్గా పూజ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే టాప్ 5 బతుకమ్మలకు బహుమతులు కూడా అందిస్తున్నారు. అలాగే బెస్ట్ డ్రెస్ లేడీస్ కి బహుమతులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు బొమ్మల కొలువులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రవేశం ఉచితంగానే వుంటుంది. కార్యక్రమం తర్వాత ప్రసాద వితరణ కూడా వుంటుంది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ షిప్ చేయాలనుకునే వారు విజయ్ భాస్కర్ కలాల్ (201)774-2221, లేదా శిరీష గుండపనేని (201`) 410-8947 ని సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే పూర్ణా బేదుపూడి (732) 856-7820, నరేంద్ర ఎర్రంగూరి (201) 962-0284, వేణు గిరి (732) 910-9017 ని సంప్రదించవచ్చు. అలాగే వేండార్ స్టాల్స్ కోసం దీపక్ కట్టా (337) 660-6248, వెంకీ ముస్తీ (908) 367-8139) ని కూడా సంప్రదించవచ్చు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి మనం మన కుటుంబీకులందరితో ఉత్సాహంగా హాజరవుదాం. అందరితో కలిసి పండగను నిర్వహించుకుందాం.
కార్యక్రమ వివరాలు ఇలా వున్నాయి..
తేదీ : 17 అక్టోబర్, 2026
సమయం : ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
వేదిక : Royal Albert’s Palace 1050 king georges post rd, fords, NJ 08863
కార్యక్రమ స్పెషల్ హైలెట్స్
దుర్గా పూజ
టాప్ 5 బతుకమ్మలకు బహుమతులు
రాఫెల్ టిక్కెట్స్
బెస్ట్ డ్రెస్ లేడీస్ కి బహుమతులు
వెండార్ స్టాల్స్
బొమ్మల కొలువులు
సాంస్కృతిక కార్యక్రమాలు
ఫ్రీ ఎంట్రీ








