కాలిఫోర్నియాలో ఏఐఏ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్… విజేతలకు బహుమతులు
కాలిఫోర్నియాలో ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికాన్స్ (AIA), బోలీ 92.3 FM సంయుక్తంగా దసరా దివాళి ధమాకా వేడుకల్లో భాగంగా బృహత్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు, ప్రారంభ స్థాయి క్రీడాకారుల నుండి అనుభవజ్ఞులైన చెస్ మాస్టర్ల వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న వ్యూహాత్మక చతురతను వెలికితీసేలా ఈ పోటీలను రూపొందించారు. క్రీడాకారుల సౌకర్యార్థం ఇందులో యుఎస్సిఎఫ్ రేటెడ్(USCF Rated), నాన్-రేటెడ్ (Non-Rated) అనే రెండు ప్రధాన కేటగిరీలలో మ్యాచ్లను ప్లాన్ చేశారు.
ఈవెంట్ తేదీ, సమయం ..
ఈ చెస్ టోర్నమెంట్ అక్టోబర్ 17, 2026 రోజు ప్లీజంటన్లోని ప్రసిద్ధ అలమెడ కౌంటీ ఫెయిర్గ్రౌండ్స్ (Alameda County Fairgrounds, Pleasanton, CA) వేదికగా జరగనుంది. ఈ పండుగ సంబరాలు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రోజంతా వైభవంగా కొనసాగుతాయి. పోటీలలో పాల్గొనే ఆటగాళ్ల కోసం క్వాడ్ స్టార్ట్ టైమింగ్స్(QUAD Timings) రూపంలో వివిధ సమయాలను కేటాయించారు. చెస్ ప్రియులు 12:00 PM, 1:30 PM, 3:00 PM, 4:30 PM స్లాట్లలో పోటీలలో పాల్గొనవచ్చు.
బహుమతులు, పండుగ ప్రత్యేక ఆకర్షణలు
ఈ చెస్ పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచే క్రీడాకారుల కోసం మొత్తం 15 ప్రతిష్ఠాత్మక ట్రోఫీలు, 15 మెడల్స్, 30 ప్రశంసా పత్రాలను బహుమతులుగా అందించనున్నారు. కేవలం చెస్ పోటీలే కాకుండా ఈ దసరా దివాళి ధమాకా వేడుకలలో కుటుంబ సమేతంగా వినోదాన్ని పంచేందుకు కంటికి ఇంపుగా నిలిచే అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, రుచికరమైన వంటకాల స్టాళ్లు , వినోద క్రీడలను ప్రత్యేక ఆకర్షణగా నిలపనున్నారు.
రిజిస్ట్రేషన్, ఫోన్ నంబర్లు
ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/JOINAIACHESS ఆన్లైన్ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈవెంట్ ఎంట్రీ టిక్కెట్ల కోసం www.aiaevents.org అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. నమోదు ప్రక్రియ లేదా ఇతర సమగ్ర సమాచారం కోసం (408) 490-0220, (510) 421-3535, (408) 499-6530 లేదా (650) 701-5487, (650) 933-0233 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు.








