తానా ఆధ్వర్యంలో డిసెంబర్ 6 న ‘శివ – శంభో స్వయంభో’ లైవ్ స్పెక్టాకిల్
నిరంతరం సామాజిక, సేవా కార్యక్రమాలతో సేవ చేస్తున్న సంస్థ తానా. (TANA). ఈ సారి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలో అంగరంగ వైభవంగా ‘శివ – శంభో స్వయంభో’ లైవ్ స్పెక్టాకిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సంగీతం, నృత్యం, నాటకం మరియు స్టేజ్క్రాఫ్ట్ల మేళవింపుతో కూడిన ఒక అద్భుతమైన లైవ్ స్పెక్టాకిల్ ‘SHIVA – SHAMBHO SWAYAMBHO’ ప్రదర్శనతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డిసెంబర్ 6 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. విల్లార్డ్ మిడిల్ స్కూల్ (Willard Middle School), 40915 బ్రాడాక్ రోడ్, ఆల్డీ, VA 20105. వేదికగా జరగనున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని ‘‘కళా వేదిక’’ వారు ప్రొడ్యూస్ చేస్తుండగా… ‘‘నాట్యమార్గం – ఇంద్రాణీ’’ సహకారంతో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంద్రానీ మహాదేవ దర్శకత్వం వహిస్తుండగా, వర్షిని క్రియేటివ్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
TANA అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మరియు కల్చరల్ కోఆర్డినేటర్ సాయి సుధా పాలుడుగు నేతృత్వంలోని TANA లీడర్షిప్ టీమ్ (సుధీర్ కొమ్మీ, సాయి బొల్లినేని, శ్రీనివాస్ కుకట్ల, జనార్థన్ నిమ్మలపూడి, అనిల్ ఉప్పలపాటి, త్రిలోక్ కాంతేటి) ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శివ భక్తి తత్వంతో, అద్భుతమైన కళా రూపాలతో సాగే ఈ దృశ్యకావ్యాన్ని ఆస్వాదించడానికి తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
సంగీతం, నృత్యం, నాటకం మరియు అద్భుతమైన రంగస్థల కళతో కూడిన ఒక అద్భుతమైన ప్రత్యక్ష ప్రదర్శన అయిన “శివ శంభో స్వయంభో” ద్వారా పరమశివుని దివ్య మహిమను చూపిస్తున్నామని, దీనిని వీక్షించేందుకు అందరూ రావాలని తానా పిలుపునిస్తోంది.శివుని దివ్య గాథలను మరియు ఆధ్యాత్మిక సారాన్ని సజీవంగా ఆవిష్కరించే ఈ కార్యక్రమం ద్వారా పరమశివుని శక్తిని, భక్తిని మరియు వైభవాన్ని అనుభూతి పొందాలని సూచించింది.







