అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లకు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు!
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబ్ బచ్చన్(Amithab bachan), ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్(Abhishek bachan)లకు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్(Goldie dhillon) నుంచి మరోసారి హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అమితాబ్ ఇల్లు జల్సా వద్ద దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఇద్దరు అనుమానిత షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్‌తో పాటు ఆడియో మెసేజ్ ద్వారా ధిల్లాన్ తాజా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
తన అనుచరులు వికాస్ ఠాకూర్(Vikas thakur), దీపక్ సింగ్(Deepak singh) అరెస్టయినప్పటికీ తమ కార్యకలాపాలు ఆగబోవని ధిల్లాన్ పేర్కొన్నాడు. ముంబైలో తమ నెట్‌వర్క్‌కు చెందిన సుమారు 200 మంది ఉన్నారని చెప్పడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. అమితాబ్, అభిషేక్‌లను నేరుగా ప్రస్తావిస్తూ బుల్లెట్‌ప్రూఫ్ సేఫ్టీ కూడా వారిని కాపాడలేదంటూ హెచ్చరించాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ సిక్కు సమాజంపై కామెంట్స్ చేసేవారిని టార్గెట్ గా చేసుకుంటామని ఆడియోలో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ పరిణామాల నడుమ అమితాబ్ ఎక్స్ వేదికగా బచ్ గయే అంటూ చేసిన షార్ట్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన ఇంటితో పాటు పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో సేఫ్టీని కట్టుదిట్టం చేశారు. పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేవీ లభించకపోయినా, తాజా హెచ్చరికల నేపథ్యంలో బచ్చన్ ఫ్యామిలీకి రక్షణపై పోలీసులు మరింత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.







