పెళ్లిపై శృతిహాసన్ షాకింగ్ కౌంటర్!
హీరోయిన్ శృతిహాసన్(Shruthi haasan) మరోసారి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో వార్తల్లో నిలిచింది. ప్రముఖ నటి సుహాసిని(Suhasini)తో జరిగిన సంభాషణలో పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మీ పెళ్లి ఎప్పుడు? అని సుహాసిని ప్రశ్నించగా.. మీరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారంటూ శృతి సెటైరికల్ గా బదులిచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. తన తల్లిదండ్రులు కమల్ హాసన్(Kamal haasan), సారిక(Sarika) విడిపోయినప్పటికీ, వారిద్దరి మధ్య ఒకప్పుడు ఎంతో ప్రేమ ఉండేదని ఆమె గుర్తుచేసుకుంది.
తల్లిదండ్రులు కలిసి సినిమాలు చేయడం, క్రియేటివ్ గా ఒకరికొకరు సహకరించుకోవడం తనపై ఇంపాక్ట్ చూపిందని శృతి తెలిపింది. లైఫ్ పార్టనర్‌తో కలిసి వర్క్స్ చేయడం, కొత్త విషయాలను నిర్మించుకోవడం తనకు ముఖ్యమని వెల్లడించింది. ఇదిలా ఉంటే, ముంబైలోని తన ఇంట్లో ఫియోనా అనే భారీ మానెక్విన్ కారణంగా వింత అనుభవాలు ఎదురైనట్లు ఆమె పేర్కొన్నారు. అది తనకు తెలియకుండానే ప్లేసెస్ మార్చుకుంటుండటంతో చివరకు దానిని తొలగించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఆ ఎక్స్‌పీరియెన్స్ తర్వాత ఇంట్లో ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ, చేతిలో ఉప్పు పట్టుకుని ఇంటిని శుద్ధి చేసినట్లు శృతి వెల్లడించింది. ప్రస్తుతం తన ఇంట్లో ఎలాంటి వింత ఘటనలు జరగడం లేదని తెలిపారు. తన ఫ్యామిలీలో తాను మాత్రమే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగిన వ్యక్తినని శృతి చెప్పింది. విక్కా, పేగన్ సంప్రదాయాలపై కూడా తనకు ఇంట్రెస్ట్ ఉందని, ముఖ్యంగా మహిళా పూర్వీకుల హిస్టరీ, వారి ఆచారాల గురించి తెలుసుకోవడం ఇష్టమని వెల్లడించింది.







