మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం కాకా(kaaka) సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న విశ్వంభర(Vishwambhara)తో పాటు కాకాను కూడా 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాల తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్‌పై ఇప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. పలువురు యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో చేయాల్సిన సినిమా ప్రస్తుతానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మెగాస్టార్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడీ చేసి వినిపించారట. ఈ కథకు చిరంజీవి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య(DVV Danayya) ఈ సినిమాను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే కథను రామ్ చరణ్(Ram charan)కు త్రివిక్రమ్ వినిపించగా, ఇప్పుడు మెగాస్టార్ ఇమేజ్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చే ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందట.
ఇవి కూడా చదవండి
మరోవైపు త్రివిక్రమ్ ఎన్టీఆర్(NTR)తో గాడ్ ఆఫ్ వార్(God Of war) ప్రాజెక్ట్‌పై కూడా పనిచేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇతర సినిమా కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా చిరంజీవి సినిమాను పట్టాలెక్కించి, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.







