ప్రెగ్నెంట్ అని తెలియక ఒకరోజే 100 సిగిరెట్లు తాగిన నటి
ప్రముఖ నటి సోనీ రజ్దాన్(Soni rajdan) తన కుమార్తె అలియా భట్(Alia bhatt) గర్భంలో ఉన్న టైమ్ లో ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని తాజాగా వెల్లడించారు. తాను గర్భవతిననే విషయం తెలియకుండానే ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఒక్కరోజులో దాదాపు 100 సిగరెట్లు తాగాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. 1993లో తన భర్త మహేష్ భట్(Mahesh bhatt) దర్శకత్వంలో తెరకెక్కిన గుమ్రా(Gumra) మూవీ షూటింగ్ టైమ్ లో ఈ ఘటన జరిగినట్లు గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ఓ సీన్ కోసం పదేపదే సిగరెట్లు తాగాల్సి వచ్చిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఆ టైమ్ లో తనకు ప్రెగ్నెన్సీ గురించి ఎలాంటి అవగాహన లేదని, ఆ సీన్ షూటింగ్ లో భాగంగా భారీ సంఖ్యలో సిగరెట్లు తాగాల్సి వచ్చిందని సోనీ పేర్కొన్నారు. వాస్తవానికి తనకు స్మోకింగ్ అలవాటు లేదని, అయితే ఆ ఎక్స్‌పీరియెన్స్ తర్వాత సిగరెట్లపై కోరిక మొదలైందని వెల్లడించారు. అంతేకాకుండా సినిమాలోని ఉరి తీసే సీన్ ను కూడా అలియా కడుపులో ఉన్నప్పుడే షూట్ చేశారని తెలిపారు.
ఐదు నెలల బ్రేక్ తర్వాత తిరిగి షూటింగ్‌కు వచ్చినప్పుడు బేబీ బంప్ కారణంగా తన బట్టలు సరిపోలేదని, దీంతో మేకర్స్ వాటిని మార్చాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అంతకుముందు తన తొలి ప్రెగ్నెన్సీ టైమ్ లో బునియాద్ టీవీ సిరీస్‌లోనూ వర్క్ చేశానని తెలిపారు. ఆ టైమ్ లో డైరెక్టర్ రమేష్ సిప్పీ(Ramesh sippi)తో పాటు చిత్రబృందం అందించిన సహకారాన్ని సోనీ స్పెషల్ గా ప్రశంసించారు.







