రివ్యూ : ‘ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47’ టార్గెట్ రీచ్ అయిన AK:47
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా,
రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు.
సంగీతం: తమన్ ఎస్, సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: కెవిన్ కుమార్, సమర్పణ: శ్రీమతి మమత
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
రచన , దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ: 30.10.2026
నిడివి :2 ఘంటల 29 నిముషాలు
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas) ల కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి కాకపోతే ఆ రెండు సినిమాలకు దర్శకుడు విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ మాత్రం ఆ చిత్రాలకు సంబాషణలు అందించారు. మళ్ళి ఇన్నేళ్ల తర్వాత త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో ఇద్దరు కాంబి లో వచ్చిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47’ (Adarsha Kutumbam Inti Number 47- AK:47). అనేక వాయిదాల తర్వాత మొత్తానికి ఈ మూవీని నిన్న అక్టోబర్ 30న విడుదల చేశారు. మరి ఈ మూవీతో త్రివిక్రమ్ ప్రజెంట్ ట్రెండ్‌ని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించాడా? వెంకీ, త్రివిక్రమ్ కాంబో ఉన్న ఫ్యాన్ బేస్‌ని ఆకట్టుకున్నారా? లేదా? అన్నది సమీక్షలో చూద్దాం.
కథ :
బిహార్‌కి చెందిన చందన్ (ఉదయ్బిర్ సంధు), నీలా (దేవియాని శర్మ) దండుపాళ్యం బ్యాచ్ దోపీడి, హత్యలు చేస్తుంటుంది. మహారాష్ట్రలోని గోరేగావ్‌లో మధు సర్కార్‌లో ఇంట్లో దోపిడీ చేసి జడ్జ్ అయిన ప్రదీప్ సర్కార్ (నాజర్)ని హత్య చేస్తుంది. ఆ తర్వాత వారి కన్ను తెలంగాణ మీద పడిందని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వస్తుంది. దీంతో ఎస్పీ దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఆ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.ఇంకో వైపు చిట్టిబాబు తొట్టి (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి), సంపూర్ణ (యువిక), శర్వా (రాజా ప్రజ్వల్) మధ్మ తరగతి కుటుంబం. అప్పులు, ఆర్థిక సమస్యలతో జీవితాన్ని లాగించేస్తుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి కోటిశ్వరులు అయిపోతారు. గేటెడ్ కమ్యూనిటీలో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఆపై బీహార్ గ్యాంగ్ కన్ను చిట్టిబాబు ఫ్యామిలీ మీద పడుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న చిట్టిబాబు కుటుంబాన్ని బీహార్ దోపిడి ముఠా ఎందుకు టార్గెట్ చేసింది? దోపిడికి వచ్చిన బీహార్ గ్యాంగ్ నుంచి చిట్టిబాబు ఫ్యామిలీ ఎలా తమను తాము రక్షించుకొన్నది? అసలు ఈ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ ఏంటి? చివరకు చిట్టిబాబు ఫ్యామిలీ పోలీసులు, బీహార్ గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకొని సేఫ్ అయ్యారు అనే ప్రశ్నలకు సమాధానమే ఆదర్శ కుటుంబం సినిమా కథ.అసలు ఇందులో వేటాడేది ఎవరు? ఎర ఎవరు? చివరకు బలి అయ్యేది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీ నటుల హావభావాలు :
వెంకటేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అసవరం లేదు. ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. నవ్వించడం, ఏడ్పించడం, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నింట్లో వెంకటేష్ తన మార్క్ చూపిస్తారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ, యాక్షన్ మోడ్‌తో సాగే క్మారెక్టర్లో ఒదిగిపోయారు. గృహిణి పాత్రలొ స్వర్ణగా శ్రీనిధి శెట్టి కొత్తగా కనిపించింది. గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగానే కాకుండా ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరు బాల నటులు బాగా నటించారు. నారా రోహిత్, రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నారా రోహిత్ పాత్ర అంత గొప్పగా అనిపించదు. విలన్ గ్యాంగ్ బాగుంటుంది. సత్య కామెడీ సీన్స్ సినిమాకి హైలెట్. నివేదా పేతురాజ్ పాత్రకి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. రఘు బాబు, బ్రహ్మాజీ రావు రమేష్ ఇలా అందరూ కామెడీతో నవ్విస్తారు. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
సాంకేతికవర్గం పనితీరు :
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పదునైన డైలాగ్స్, కామెడీ సన్నివేశాలు, కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలు చుట్టే తిరగడం సహజం. అలాంటి నేపథ్యంతోనే ఈ సినిమా ప్రెసెంట్ చేసాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా వెంకీ కామెడీ టైమింగ్‌తో త్రివిక్రమ్ కవర్ చేసేస్తాడు. దొంగల గ్యాంగ్, వారు హత్యలు చేసే విధానం, వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం అంటూ కథను చాలా సీరియస్‌గానే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత చిట్టిబాబు ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. అక్కడి నుంచి దాదాపు ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కథ సాదాసీదాగా, ఊహకందేలా సాగుతుంది. తమన్ పాటల కంటే బీజీఎం బాగుంటుంది. ఇక వెంకీ మామ ఆటో నడిపే సీన్లలో సీజీ వర్క్, గ్రాఫిక్స్ తేలిపోతుంది. అలా కొన్ని చోట్ల కొంత వరకు కొన్ని లాజిక్స్‌ని వదిలేస్తే పూర్తి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఇక త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ థియేటర్లో బాగానే పేలుతాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి.
విశ్లేషణ :
ప్రస్తుతం ఉన్న ఆడియెన్స్‌కి రక్తపాతం, హై టెన్షన్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్, చెవులు మోత మోగేలా బీజీఎం ఇష్టంగా ఉంటోంది. త్రివిక్రమ్ కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యాడు. అయితే తనకు వచ్చిన, నచ్చిన గ్రౌండ్‌ని మాత్రం వదిలి పెట్టలేదు. తను దిట్ట అయిన కామెడీ, ప్రాస, పంచ్‌ల్ని వదలకుండా ఈ క్రైమ్, యాక్షన్‌ని అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. దొంగల గ్యాంగ్, వారు హత్యలు చేసే విధానం, వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం అంటూ కథను చాలా సీరియస్‌గానే స్టార్ట్ చేస్తారు. సినిమా తొలి భాగమంత టైంపాస్ మూమెంట్స్, క్రైమ్, యాక్షన్ అంశాలతో త్రివిక్రమ్ సినిమాలో ఉండే కంటెంట్ భిన్నంగా సాగుతుంది. హింస, రక్తపాతం కాస్త పెచ్చుగానే కనిపిస్తుంది. మాస్ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా మొదటి భాగాన్ని ఫన్, ఎమోషన్స్‌తో ముగించారు.
సెకండాఫ్ ఏమైనా ఎమోషనల్‌లా సాగదీస్తాడేమో అని అంతా అనుకుని ఉంటారు. కానీ అక్కడ కూడా తివిక్రమ్ తనదైన పంధా ని చూపించాడు. ఆడియెన్స్‌ని ఇంకా ఏడ్పించాలని, మరింతగా డిప్రెషన్లోకి తీసుకు వెళ్లాలని త్రివిక్రమ్ అనుకోలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ని కూడా చాలా వరకు తన కామెడీ, ప్రాసలు, పంచ్‌లతోనే నడిపించాడు. పెద్ద పెద్ద ట్విస్టులు, భారీ క్లైమాక్స్ ఉంటుందని అనుకుంటే మాత్రం పొరబాటే. చాలా సింపుల్‌గానే సినిమా ముగుస్తుంది. ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి క్రైమ్ డ్రామాని జొప్పించే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఏకే 47 (ఆదర్శకుటుంబం ఇంటి నెం. 47) బాగానే ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి, మాస్‌కి, యూత్ ఆడియెన్స్‌కి మంచి టైం పాస్ అయ్యేందుకు ఈ సినిమాని ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. మరి కమర్షియల్‌గా వెంకీ, త్రివిక్రమ్ కాంబో ఏ రేంజ్‌కు వెళ్తుందన్నది వేచిచూడాలి.








