రాప్తాడు ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాప్తాడు ఘటన (Raptadu incident)లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన అనంతరం ధర్మవరం వైపు పారిపోతుండగా పోలీసులు (Police) పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని ధర్మవరం (Dharmavaram) మండలానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతడు బాలికకు సమీప బంధువు అవుతాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు దాడి జరిగిన తరగతి గదిని ఫోరెన్సిక్ బృందం (Forensic team) పరిశీలించింది. ఘటనాస్థలిలో దాడికి ఉపయోగించిన రంపం మెషీన్ను స్వాధీనం చేసుకుంది. అనంతరం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పై ఉన్మాది రంపంతో దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలిక అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.








