అంబజీ యూఎస్ శ్రీ శక్తి మందిర్ లో దీపావళి సంబరాలకు ఏర్పాట్లు పూర్తి
అమెరికాలోని అంబజీ యూఎస్ఏ శ్రీ శక్తి మందిర్ లో దీపావళి సంబరాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 8 వ తేదీన ఈ సంబరాలను నిర్వహించనున్నారు. అంబజీ యూఎస్ఏ – శ్రీ శక్తి మందిర్, 1450 హూయి రోడ్, లేక్ సిటీ, GA 30260.కేంద్రంగా ఈ సంబరాలు జరగనున్నాయి.
నవంబర్ 8 న రాత్రి 8:00 గంటలకు డీజే, సంగీత విభావరితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా బాణాసంచా కాల్చడంతో ప్రారంభం అవుతాయి.
రాత్రి 9:00 గంటలకు అద్భుతంగా, అందర్నీ ఆకట్టుకునేలా భారీ బాణాసంచ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ వేడుకల కోసం వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మెనూలో భాగంగా
మలాయ్ కోఫ్తా (Malai Kofta) పన్నీర్ భుర్జీ (Paneer Bhurji) దాల్ తడ్కా (Dal Tadka) జీరా రైస్ (Jeera Rice) గులాబ్ జామున్ (Gulab Jamun) పరాఠా (Paratha) సలాడ్ (Salad) లాంటి వాటితో అద్భుతమైన వంటకాలను సిద్ధం చేయనున్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగస్వాములు కావాలనుకునే వారు లేదా విరాళాలు అందించాలనుకునే వారు పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా లేదా AMBAJI అని టైప్ చేసి 73256 కు టెక్స్ట్ చేయడం ద్వారా సులభంగా విరాళం అందించవచ్చు.మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.ambajiusa.org ను సందర్శించవచ్చు. లేదా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 770-968-3490 మరియు 404-883-2843.
స్థానిక ప్రవాసులందరూ ఈ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.








