27th October 2026

_________

- Bhuvana

నోరూరించే ఆంధ్రా స్టైల్ చికెన్ పికిల్.. ఇంట్లోనే సులభంగా ఇలా చేయండి!

చికెన్, కారం, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వుల నూనె, వెనిగర్ లేదా నిమ్మరసం సిద్ధం చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు

శుభ్రం చేసిన బోన్లెస్ చికెన్‌లో ఉప్పు, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి 30 నిమిషాలు మ్యారినేట్ చేయండి. దీంతో రుచి బాగా కలుస్తుంది.

చికెన్‌ను మ్యారినేట్ చేయండి

ముందుగా చికెన్‌లోని తేమ పూర్తిగా పోయేలా ఉడికించి, తర్వాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఇదే నిల్వకు కీలకం.

చికెన్‌ను వేయించి సిద్ధం చేయండి

ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్కను స్వల్పంగా వేయించి పొడి చేయండి. తాజా మసాలాతో పికిల్ రుచి మరింత పెరుగుతుంది.

పికిల్ మసాలా తయారు చేయండి

అదే నూనెలో వెల్లుల్లి, కరివేపాకు వేయించి కారం, మసాలా పొడి వేసి కలపండి. తరువాత వేయించిన చికెన్‌ను వేసి బాగా కలియబెట్టండి. 

తాలింపు వేసి మసాలా కలపండి

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెనిగర్ లేదా నిమ్మరసం కలపండి. దీంతో పికిల్ రుచి సమతుల్యంగా ఉండటమే కాకుండా నిల్వ కూడా మెరుగవుతుంది.

వెనిగర్ లేదా నిమ్మరసం చివర్లోనే

పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి, గాలి చొరబడని గాజు సీసాలో నింపండి. తేమ ఉంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

పూర్తిగా చల్లారిన తర్వాతనే నిల్వ చేయండి