‘‘తెలుగు పఠన పోటీల్లో’’ ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు..
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA), తానా సంయుక్తంగా తెలుగు పఠన పోటీలు నిర్వహించాయి. ఇందులో యువ విద్యార్థినీ విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు తెలుగులో అనర్గళంగా మాట్లాడే విధంగా, తెలుగు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు అలాగే మన మూలాలతో అనుబంధం వుండేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా శ్రీలక్ష్మీ, శిరీష లంక, మాధవి నెక్కంటి, కృష్ణమోహన్ బూదరాజు, శివ అడుసుమిల్లి వ్యవహరించారు. ఈ సందర్భంగా వీరు పోటీలో పాల్గొన్నవారందరి ప్రతిభా విశేషాలను నిశితంగా గమనిస్తూ మార్కులు వేశారు.
ఈ కార్యక్రమంలో గెలిచిన వారి వివరాలివే…
1. Jeswitha Srikakulapu (Canton Manabadi)
2. Sri Naga Ditya Atluri (Canton Manabadi)
3. Nishitha (Canton Manabadi)
4. Srikar Polisetty (Parents)
6th – 8th Grade Winners:
1. Aaradhya Navuluri (Novi Manabadi)
2. Dedeepya Siremamilla (Novi Manabadi)
3. Aadya Solige (Troy Manabadi)
4. Vidushi Chervu (Novi Manabadi)

మరోవైపు పాల్గొన్న విద్యార్థులందరికీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను, గురువులకు ధన్యవాదాలు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయనిర్ణేతలకు కూడా ధన్యవాదాలు ప్రకటించారు. తెలుగు భాషలోని అందాన్ని ఆస్వాదించేలా, అత్యంత విలువైన భాషగా భావించేలా పిల్లలను ప్రతి రోజూ ప్రోత్సహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.








