అక్టోబర్ 31 న TTA కీలకమైన బోర్డు సమావేశం, అధిక సంఖ్యలో హాజరుకానున్న మెంబర్స్
అమెరికాలో తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ,తెలంగాణ ఎన్నారైలకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) విశేషంగా అండగా నిలుస్తోంది. ఈ అండగా నిలబడే ప్రక్రియలో బోర్డు సభ్యులు అనేక సమాలోచనల తర్వాత ఎన్నారైల కోసం అనేక కీలక నిర్ణయాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నారైల సంరక్షణ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో అత్యంత కీలకమైన బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ బోర్డు సమావేశం అక్టోబర్ 31 వ తేదీన రాడిసన్ హోటల్ (Radisson Hotel), 110 వెండర్బిల్ట్ మోటార్ పార్క్వే, హాపాగ్, న్యూయార్క్ (NY 11788) వేదికగా జరగనుంది.
ఈ సమావేశానికి TTA అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ప్రెసిడెంట్ ఎలెక్ట్ / ట్రెజరర్ సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ వీరమనేని, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డితో పాటు ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు (BODs), సలహా మండలి (Advisory Council) సభ్యులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమం, భవిష్యత్ కార్యక్రమాలు మరియు సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు.








