TTA టాంపా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేఫన్ టాంపా చాప్టర్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని తెలుగు వారందరూ ఓ చోట చేరి, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
ఈ సందర్భంగా టాంపాలోని అయ్యప్ప ఆలయంలో వీరందరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు.అందరూ ముక్త కంఠంతో, ఒకే శైలిలో బతుకమ్మ పాటలను పాడుతూ, బతుకమ్మను ఆడారు. ఈ సందర్భంగా అందరూ ఒకే రీతిలో, లయ బద్ధంగా చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
ఓ వైపు దేవీ శరన్నవరాత్రులు, మరో వైపు బతుకమ్మ సంబరాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా ఓ పద్ధతి ప్రకారం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంఘం ప్రతినిధులు నిర్వహించడంవిశేషం. అంతేకాకుండా ఎన్నారైల నుంచి కూడా విశేషంగా మద్దతు లభించింది. ఈ కార్యక్రమానికి విశేషంగా 900 మందికి పైగానే ఎన్నారైలు హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా నిర్వాహకులు వీరందరికీ కూడా ఉచితంగా భోజనాలు అందించారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేఫన్ టాంపా చాప్టర్ వాలెంటీర్లు, శ్రేయోభిలాషులు, బృందం వాలెంటీర్లు, పాఠశాల విద్యార్థుల గొప్ప సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నారైలు తమ కుటుంబీకులతో సహా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కొత్త పరిచయాలు కూడా చేసుకున్నారు. దీంతో అక్కడ ఓ అద్భుతమైన వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ ను తాము మరిచిపోకుండా, మధురానుభూతులను సంస్థ వారు అందించారని హర్షం వ్యక్తం చేశారు.








