AIA ఆధ్వర్యంలో 25 వేల మందితో దసరా, దీపావళి గ్రాండ్ సెలబ్రేషన్స్
అమెరికాలోని ప్లీసంటన్ అలమేడా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్స్ లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బుల్లీ 92.3 ఎఫ్ఎం ఆధ్వర్యంలో దసరా దీపావళి ధమాకా 2026 అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి దాదాపు 25 వేల మందికి పైగానే ఎన్నారైలు హాజరయ్యారు. ఇది దేశంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన వేడుకల్లో ఒకటిగా నిలిచిపోయింది. కేవలం దసరా, దీపావళి సంబరాలు మాత్రమే కాకుండా, ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
శాంతి, సమృద్ధి కోరుతూ నిర్వహించిన పవిత్ర మహా మంగళహారతి కూడా నిర్వహించారు. ఈ హారతితోనే సంబరాలను ప్రారంభించడం విశేషం. అలాగే దుర్గామా రథయాత్ర, భక్తి శ్రద్ధలతో యాత్రలు, సంగీతం, సాంస్కృతిక వైభవంతో ప్రాంగణాన్ని నింపేశారు. అలాగే రామాయణ గాథ ఆధారంగా ప్రదర్శించిన రాంలీలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతంగా నిర్మించిన 40 అడుగుల భారీ రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం కూడా ప్రత్యేక ఆకర్షణగానే నిలిచింది. అశేష జనవాహిని మధ్య దీని దహనం కూడా చేశారు. దీని ద్వారా చెడుపై మంచి సాధించిన ప్రతీకగా నిలిచిపోయింది.రావణ దహనం సందర్భంగా పేల్చిన బాణాసంచ అందర్నీ ఆకట్టుకుంది.
దాదాపు 500 మందికి పైగా ప్రతిభావంతులైన కళాకారులు ఇండోర్, అవుట్ డోర్ స్టేజీలపైన ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఈ ప్రదర్శనల్లో శాస్త్రీయ, జానపద, బాలీవుడ్, ఫ్యూషన్ ప్రదర్శనలు కూడా వున్నాయి. దీని ద్వారా సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పినట్లు అయ్యింది.135 వెండర్ స్టాళ్లు, 25 ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో భారతీయ వంటకాలు, మిఠాయిలతో వివిధ రకాలైన ఆహారాలను వుంచారు. అలాగే సంస్కృతిని చాటే వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు, దీపావళి అలంకరణ వస్తువులు, ఫైనాన్షియల్, ట్యాక్స్, ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలాగే సింధూర కేళ, ధునుచి నాచ్, హనుమాన్ చాలీసా పారాయణం, మహా భోజ్ ట్రెజరర్ హంట్, కార్నివాల్ రైడ్స్, చెస్ పోటీలు కూడా ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి.ఇవి కూడా ప్రత్యేక ఆకర్షణగానే నిలిచాయి.
ఇక.. ఈ కార్యక్రమానికి కాన్సుల్ జనరల్ సతీష్ శివన్, ఒర్టెగా ప్రతినిధి, శాన్ రామన్, మేయర్ మార్క్ ఆర్మ్ స్ట్రాంగ్, డబ్లిన్ మేయర్ షెర్రీ హూ, ప్లీసంటన్ మేయర్ జాక్ బాల్ప్, ప్రీమాట్ మేయర్ రాజ్ సల్వాన్, శాన్ రామన్ కౌన్సిల్ సభ్యుడు శ్రీధర్ నెరోస్, తదితరులు విచ్చేశారు.

ఈ వేడుకలను సక్సెస్ చేయడంలో స్పాన్సర్లు డేవిడ్ హోబర్ట్, సంజీవ్ గుప్తా సీసీఏ, డాక్టర్ ప్రకాష్, రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెలోపాడ్, రియల్టర్ నాగరాజఎ అన్నయ్య లైఫాజలజీ జూమ్ ఎ పేపాల్ సర్వీస్ గోపీ డైరీ, ఏఐఏ ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించింది. అలాగే సిరియా పసిఫిక్ ప్రైవేట్ వెల్త్, విజయ్ సూపర్ మార్కెట్, అపెక్స్ కన్సల్టింగ్, ఆజాద్ ఫైనాన్సియల్, మలబార్ జువెలర్స్, తదితరులు స్పాన్సర్లుగా వ్యవహరించారు.
ఇక మీడియా పార్టనర్లుగా తెలుగు టైమ్స్, టీవీ9 యూఎస్ఏ, యో ఇండియా టీవీ, ఎన్బీసీ బే ఏరియా, నమస్తే ఆంధ్రతో సహా పలు సంస్థలు వ్యవహరించాయి.








