బ్లాక్ లెదర్ కోట్ లో లేడీ డాన్ ని మరిపిస్తున్న కరీనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(kareena kapoor) గురించి, ఆమె అందం, ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడుతన ఫ్యాషన్ ఎంపికలతో సోషల్ మీడియాను షేక్ చేసే కరీనా అలియాస్ బెబో ఇప్పుడు మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది.

తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో కరీనా బ్లాక్ లెదర్ కోట్, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ లో మాఫియా క్వీన్లాగా ఇచ్చిన పోజులు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ లుక్ లో బెబో అందం మరింత రెట్టింపైందని కరీనా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.








