అఖిల్ నెక్స్ట్పై సస్పెన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నెక్ట్స్ మూవీ ఏంటనే ఇంట్రెస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో నెలకొంది. లెనిన్(Lenin) సినిమా సక్సెస్‌తో అఖిల్‌పై అంచనాలు పెరగడంతో, ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు తన కొత్త సినిమాకు సంబంధించి అఖిల్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. దీంతో ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? ఏ జానర్లో తెరకెక్కనుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అఖిల్ కొత్త సినిమా గురించి ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. విభిన్న కథాంశాలతో కూడిన ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తున్నారంటూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ ప్రచారాల్లో ఏ ఒక్క ప్రాజెక్ట్‌పైనా అఫీషియల్ క్లారిటీ లేదు. దీంతో అఖిల్ తర్వాతి సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు, తన కెరీర్లో నెక్ట్స్ స్టెప్ విషయంలో అఖిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
తాజా సమాచారం ప్రకారం, అఖిల్ ప్రస్తుతం తన వద్దకు వస్తున్న కథలను శ్రద్ధగా వింటూ, తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూస్తున్నారట. గత సినిమాల ఎక్స్ఫీరియెన్స్లను దృష్టిలో ఉంచుకుని, స్ట్రాంగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే, ఈ విషయాలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సరైన కథ, డైరెక్టర్ కుదిరిన తర్వాతే తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్‌తో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.








