దాదాలో రైల్వే స్టేషన్ ఫైట్.. క్రాక్‌ను మించి ఉంటుందా?
నటసింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), మాస్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దాదా(Dada)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి(Veerasimha reddy) బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకోవడంతో, మరోసారి ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దాదా సినిమాలో ప్రస్తుతం రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే భారీ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్(Ram)- లక్ష్మణ్(Lakshman) కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ రైల్వే స్టేషన్ వంటి భారీ సెటప్‌లో తెరకెక్కుతున్న ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా రవితేజ(Raviteja) నటించిన క్రాక్(Crack) సినిమాలో బస్టాండ్ ఫైట్ ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడు దాదాలోని రైల్వే స్టేషన్ ఫైట్ ఆ సీక్వెన్స్‌ను మించేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బాలయ్య(balayya) ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలు తెప్పించే యాక్షన్ ఎపిసోడ్ రెడీ అవుతున్నట్టే. అయితే ఈ ఫైట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సినిమాలో దాని ప్రాధాన్యం తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.








