జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూఎస్ఏ ఆధ్వర్యంలో శ్రద్ధాసక్తులతో సాగుతున్న ‘‘రామాయణ పారాయణం’’
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) యూఎస్ఏ, శ్రీ అష్టలక్ష్మీ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీమద్ వాల్మీకీ రామాయణ పారాయణంగా ఘనంగా ప్రారంభమైంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల నాలుగో తేదీన ప్రారంభమై, వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ పారాయణ కొనసాగుతుంది. భక్తులు ప్రతి రోజూ అత్యంత శ్రద్ధా భక్తులతో పారాయణానికి హాజరవుతున్నారు.
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకూ కొనసాగుతోంది. మొత్తం 29 రోజులు, 7 కాండలు, 24 వేల శ్లోకాల పారాయణ వుంటుంది.ఇందులో పాల్గొని, శ్రీ రాముడి ఆశీస్సులు పొందాలని JET USA మరియు శ్రీ అష్టలక్ష్మి ఆలయం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి.
అలాగే దేవీ శరన్నవరాత్రి పుణ్య కాలంలో సీతా చరిత్ర’ పఠనం ద్వారా జగన్మాత అయిన శ్రీ సీతా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునే శుభ సమయం కూడా.
అయితే ఈ పవిత్ర కార్యక్రమానికి విరాళాలను ఇవ్వాలనుకునే వారు ఒక రోజుకి 51 డాలర్లు, ఒక కాండ కోసం 251 డాలర్లు, మొత్తం 29 రోజులకు గాను 1,116 డాలర్లుగా నిర్ణయించారు. మీరిచ్చే ఈ విరాళాలు ఈ రామాయణ పారాయణానికి సంబంధించిన కార్యక్రమానికే వినియోగిస్తారు.
ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రత్యక్షంగా ఈ పారాయణానికి హాజరు కాకపోతే, https://www.youtube.com/live/MAYkXRb-tKY?is=l68Fpxyi6AlxlJdv ] లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చూడొచ్చు.








