ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోండి.. గ్రేటర్ డెలావేర్ వాలీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఉచిత వెబినార్!
మీరు చెల్లిస్తున్న పన్నులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారా? మీ పన్ను భారాన్ని తగ్గించుకుంటూ సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో తెలుసుకోవడానికి గ్రేటర్ డెలావేర్ తెలుగు సంఘం(TAGDV) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో భాగంగా అడ్వాన్స్డ్ ట్యాక్స్ స్ట్రాటజీస్(Advanced Tax Strategies) అనే అంశంపై ఒక ఉచిత ఎడ్యుకేషనల్ వెబినార్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
వెబినార్‌లో చర్చించే అంశాలు…
క్లీన్ ఎనర్జీ వ్యూహాలు: ట్యాక్స్ క్రెడిట్లు, యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్, ప్రోత్సాహకాలు.
బాక్స్ హోమ్ అవకాశాలు: డిప్రిసియేషన్ పొటెన్షియల్‌తో కూడిన ప్రత్యామ్నాయ రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యూహాలు.
పరికరాల అద్దె (Equipment Rentals): వ్యాపార అవసరాల పరికరాలు, లీజింగ్ స్ట్రక్చర్స్ ద్వారా లభించే యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్.
లివరేజ్డ్ ఛారిటబుల్ డొనేషన్స్: పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సేవలకు మద్దతు ఇవ్వడం.
వెబినార్ వివరాలు:
తేదీ: ఆదివారం, అక్టోబర్ 25, 2026
సమయం: మధ్యాహ్నం 2:00 PM (ET)
ఫార్మాట్: వర్చువల్ వెబినార్
ప్రెజెంటర్: మధు బుడతి (Certified Tax and Business Advisor | President, Vyom Financial Group)
వ్యాపారవేత్తలు, నిపుణులు , ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన కీలక పన్ను ప్రణాళికా విధానాలపై ఈ వెబినార్ సాగనుంది. ఆసక్తి గలవారు https://forms.gle/








