హార్వర్డ్‌లో చదివే ఇండియన్లకు బ్యాడ్ న్యూస్? ట్రంప్ మళ్లీ అదే పని చేయబోతున్నారా?
హార్వర్డ్‌లో సీటు రావడం ప్రపంచవ్యాప్తంగా చాలామంది విద్యార్థులకు డ్రీమ్ . అందుకోసం తెగ కృషి చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి అడ్మిషన్ వచ్చేస్తే…. అమెరికా వెళ్లిపోవచ్చు.. చదువు పూర్తయ్యాక మంచి కెరీర్ సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాన్‌కు పూర్తి స్దాయిలో చెక్ పెట్టే పరిస్దితి ఎదురవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ఎంట్రీపై పెట్టిన ఆంక్షలను మళ్లీ తీసుకొచ్చే ఛాన్స్ కనపడుతోంది.
ట్రంప్‌కీ – హార్వర్డ్కీ అసలు గొడవేంటి?
ఈ స్టోరీ ఇప్పుడే మొదలైనది కాదు. 2025 మేలోనే ట్రంప్ ప్రభుత్వం, హార్వర్డ్ మధ్య గొడవ మొదలైంది. హార్వర్డ్ విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతికి సంబంధించిన ప్రభుత్వ గుర్తింపును రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది.
హార్వర్డ్ మాత్రం “అలా కుదరదు” అంటూ కోర్టుకు వెళ్లింది. అక్కడి నుంచి అసలు లీగల్ వివాదం మొదలైంది. కోర్టు కూడా ప్రభుత్వ చర్యలను అడ్డుకుంది.
ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. హార్వర్డ్‌లో చదవడానికి అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల ఎంట్రీనే ఆపాలని ప్రయత్నించింది. ఈ నిర్ణయాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. చివరికి ఆ పాత బ్యాన్ 2025 డిసెంబర్లోనే ముగిసిపోయింది. ఇప్పుడు పాత గడువు ముగిసిన ఉత్తర్వులపై ఇంకా న్యాయపోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న.
“కోర్టు అడ్డంకి తొలగితే మళ్లీ బ్యాన్ తెస్తాం”
కోర్టులో ట్రంప్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది టిబెరియస్ డేవిస్ చెప్పిన మాట ఇప్పుడు కీలకంగా మారింది. పాత కోర్టు ఉత్తర్వుల అడ్డంకి వల్లే ప్రభుత్వం కొత్త నిషేధాన్ని తీసుకేలేకపోతోందని, అప్పీల్లో గెలిచి ఆ అడ్డంకిని తొలగించుకోగలిగితే ప్రభుత్వం కొత్త ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఇక్కడే అసలైన మెలిక ఉంది. బ్యాన్ ఆటోమేటిక్‌గా తిరిగి రాదు. కానీ కొత్త బ్యాన్ పెట్టే అవకాశం మాత్రం మళ్లీ ఓపెన్ అవుతుంది. అందుకే హార్వర్డ్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులు, అక్కడ చదవాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ ఈ కేసును చాలా సీరియస్‌గా చూస్తున్నారు.
మరి మన ఇండియన్ స్టూడెంట్స్ సంగతేంటి?
హార్వర్డ్‌లో చదవడానికి ఇండియా నుంచి ప్రతీ సంవత్సరం చాలా మంది ప్రిపేర్ అవుతూంటారు. ఒక విద్యార్థికి సీటు వచ్చిందంటే అంతా అయిపోయినట్టే కాదు. తర్వాత వీసా, ట్రావెల్, అకామడేషన్, ఫీజులు.. ఇలా చాలా విషయాలు ఉంటాయి.
ఇప్పుడు మధ్యలో అమెరికా “కొత్త రూల్” అంటూ ఎంట్రీపై ఆంక్షలు పెడితే? అప్పటికే చేసిన ప్లానింగ్ మొత్తం తలకిందులయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
అందుకే ఇక్కడ అసలు టెన్షన్ “బ్యాన్ వస్తుందా?” అన్న ఒక్క ప్రశ్న కాదు. వస్తే ఎవరి మీద పడుతుంది? ఇప్పటికే హార్వర్డ్‌లో ఉన్నవాళ్లపైనా? కొత్తగా వెళ్లేవాళ్లపైనా? అడ్మిషన్ వచ్చినా అమెరికాలోకి ఎంట్రీ దొరుకుతుందా? అన్నదే అసలు విషయం.
అయితే ఇప్పుడే అమెరికా ప్లాన్ క్యాన్సిల్ చేయాలా?
అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కొత్త బ్యాన్ ఏదీ రాలేదు. పాత బ్యాన్ 2025 డిసెంబర్లో ముగిసిపోయింది. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నది దానికి సంబంధించిన లీగల్ ఫైట్.
కాబట్టి “హార్వర్డ్‌కు ఇండియన్ స్టూడెంట్స్ ఎంట్రీ బ్యాన్ అయిపోయింది” అని సోషల్ మీడియాలో ఏదైనా కనిపిస్తే వెంటనే నమ్మాల్సిన పని లేదు.
కోర్టులో ప్రస్తుత సిట్యువేషన్ ఎలా ఉందంటే?
కోర్టు విచారణలో ట్రంప్ సైడ్ లాయర్ టిబెరియస్ డేవిస్ ఒక కీలక విషయాన్ని చెప్పారు. పాత కోర్టు ఆర్డర్ అడ్డంగా ఉంది కాబట్టే కొత్త బ్యాన్ అనౌన్స్ చేయలేకపోతున్నామని, ఈ కేసు గెలిచి ఆ ఆర్డర్ తీసేస్తే మళ్లీ కొత్త అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఓపెన్‌గా చెప్పారు. అయితే, జడ్జీలు మాత్రం గవర్నమెంట్‌ను గట్టిగానే ప్రశ్నించారు. గడువు తీరిపోయిన నిషేధంపై మళ్లీ విచారణ ఎందుకని, కొత్తగా ఏమైనా ఆంక్షలు తెస్తే అది మళ్లీ కొత్త న్యాయపోరాటానికే దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
హార్వర్డ్‌పై ఆరోపణలు – ఇతర పరిణామాలు
హార్వర్డ్ను టార్గెట్ చేయడానికి ట్రంప్ టీమ్ మెయిన్‌గా రెండు రీజన్స్ చెప్తోంది. ఒకటి క్యాంపస్‌లో యాంటీసెమిటిజం (యూదు వ్యతిరేకత) ఎక్కువైందని, ఇంకోటి చైనా కమ్యూనిస్ట్ పార్టీతో వర్సిటీకి లింక్స్ ఉన్నాయని అంటోంది. కానీ జడ్జీలు మాత్రం — ఈ సాకులు చెప్పి స్టూడెంట్స్ అందరినీ టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. ఇలా చేస్తే ఇజ్రాయెల్ స్టూడెంట్స్, లాటిన్ అమెరికన్ యూదు స్టూడెంట్స్ కూడా లూజర్స్ అవుతారు కదా అని పాయింట్ రైజ్ చేశారు.
ఇండియన్ స్టూడెంట్స్ పరిస్ధితి ఏమిటి?
హార్వర్డ్‌లో ఆల్రెడీ చదువుతున్న వాళ్లకు, లేదా అక్కడ అడ్మిషన్ దక్కించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న మన ఇండియన్ స్టూడెంట్స్‌కి ఇది కొంచెం టెన్షన్ ఇచ్చే విషయమే. ఒకవేళ కొత్త ఆర్డర్ కనుక వస్తే విసా ప్రాసెస్, ట్రావెల్ ప్లాన్స్ అంతా మెస్ అయిపోతాయి. కానీ రైట్ నౌ ఎలాంటి ట్రావెల్ బ్యాన్ లేదా కొత్త ఆంక్షలు లేవు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, దానికి ట్రంప్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే నెక్స్ట్ పిక్చర్ క్లియర్ అవుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








