కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ, అక్టోబర్ 8: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని… దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.








