ధురంధర్, రామాయణతో బాలీవుడ్‌కు ఊరట!
గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు భారీ సక్సెస్‌లు కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. ఆమిర్ ఖాన్(Aamir khan), సల్మాన్ ఖాన్(Salman khan) వంటి స్టార్ హీరోల సినిమాలు సైతం ఆడియన్స్‌ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అక్షయ్ కుమార్(Akshay kumar) వరుస సినిమాలతో సందడి చేసినప్పటికీ సక్సెస్ పరంగా నిరాశే ఎదురైంది. మరోవైపు డిజిటల్ రైట్స్ ధరలు తగ్గుముఖం పట్టడంతో నిర్మాతలు ఫైనాన్షియల్ ప్రెజర్ ను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధురంధర్(Dhurandhar) బాలీవుడ్‌కు ఆశాకిరణంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
ఆదిత్యధర్(Aditydhar) దర్శకత్వంలో రణ్వీర్ సింగ్(Ranveer singh) హీరోగా తెరకెక్కిన ధురంధర్ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లను నమోదు చేశాయి. ఈ సినిమాలతో డైరెక్టర్, హీరోతో పాటూ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్(Jio studios) భారీ లాభాలను అందుకుంది. అయితే 2026లో దృశ్యం3(Drishyam3) వంటి కొన్ని సినిమాలు మినహా బాలీవుడ్ ఇండస్ట్రీ మళ్లీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌లను అందుకోలేకపోయింది.
తాజాగా రామాయణ(Ramayana) ఫస్ట్ పార్ట్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఇండియన్ సినీ హిస్టరీలో అతిపెద్ద సక్సెస్‌ల్లో ఒకటిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ఈ పౌరాణిక సినిమా సక్సెస్‌తో 2028లో రానున్న రెండో భాగంపై కూడా ఆసక్తి నెలకొంది. భారీ సినిమాలకు ప్రేక్షకాదరణ తగ్గలేదని, ఆకట్టుకునే కథనం, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించవచ్చని ఈ సక్సెస్‌లు నిరూపిస్తున్నాయి. మొత్తంగా ధురంధర్, రామాయణ సక్సెస్‌లు బాలీవుడ్ వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపజేశాయి.







