‘అలియాస్ రుక్మిణి’ ఎమోషన్స్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు : నిర్మాత దీప్తి గంటా
నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘దండోరా’ తీసిన దర్శకుడు చెప్పిన కథ కాబట్టి ఈ సినిమా చేశారా? లేక కథ నచ్చి ఓకే చేశారా?
-నేను కథ చదివినప్పుడు ‘దండోరా’ తీసిన దర్శకుడు అని నాకు తెలియదు. ‘అలియాస్ రుక్మిణి’ కథ చదువుతున్నప్పుడే నచ్చింది. తర్వాత డైరెక్టర్ గారు చెప్పిన నరేషన్‌ను చాలా ఎంజాయ్ చేశాను. కథ నచ్చే ఈ సినిమా చేశాను.
-రెండున్నర గంటల నరేషన్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. కథ చెప్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా ఎమోషనల్‌గా ఉంది. అలాగే దర్శకుడు ఈ కథను ముగించిన తీరు కూడా చాలా హత్తుకుంది. ప్రేక్షకులకు కూడా ఒక గొప్ప అనుభూతిని అందించబోతోంది.
నాని గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది?
-నాకు కథ నచ్చిన తర్వాత నానికి చెప్తాను. తనకు నచ్చితే మొదలుపెడతాం. ‘కోర్ట్’ గానీ, ఇప్పుడు ఈ సినిమా గానీ.. అలా కథ నచ్చి ఓకే చేసినవే.
మీ సినిమాలు చాలా త్వరగా పూర్తవుతాయి. దానికి కారణం?
-నిజానికి అంత త్వరగా ఏమీ పూర్తి కావు. కాకపోతే మేము ప్లానింగ్ పూర్తయిన తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. అంతకుముందే దాదాపు అన్ని విషయాలను పక్కాగా ప్లాన్ చేసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి కొంచెం త్వరగా అయిపోతున్న ఫీలింగ్ రావచ్చు.
ఈ సినిమాలో నితిన్ గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
-ఈ కథకు నితిన్ గారు అయితే బాగుంటుందని నాని చెప్పారు. మేము నితిన్ గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి వెంటనే ఓకే చేశారు.
-నాని ఈ సినిమా చూశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం నానీ తన బ్లడీ రోమియో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అంత బిజీలో కూడా షూటింగ్ ముగించుకొని ఈ సినిమా ప్రమోషన్స్ కు సమయం కేటాయిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సినిమా విషయంలో నాని గారి సలహాలు, సూచనలు ఉంటాయా?
-కథ ఓకే చేసిన తర్వాత నాని గారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఫైనల్‌గా సినిమా చూస్తారు. అప్పుడు తనకు ఏదైనా అనిపిస్తే చెప్తారు.
డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ గురించి?
-మురళి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకు ఇండస్ట్రీ లెక్కల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. తనకు ఏది రాయాలనిపిస్తే అది హానెస్ట్‌గా రాస్తారు. అంతే క్లారిటీగా తెరకెక్కిస్తారు. చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్.
‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ గురించి?
-రుక్మిణి అనే కలం పేరుతో తను కథలు రాస్తాడు. అసలు ఆ కలం పేరుతో ఎందుకు కథలు రాస్తున్నాడు అనేది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెన్సార్ జీరో కట్స్ తో సర్టిఫికేట్ ఇచ్చింది.
మ్యూజిక్ గురించి?
-విజయ్ మంచి పాటలు ఇవ్వడమే కాదు, ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చేశారు. ఎమోషనల్‌గా చాలా మంచి కనెక్షన్‌తో మ్యూజిక్ ఉంటుంది.
సాయికుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
-ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. మన ఇంట్లో ఉండే మనుషుల్లాగే ఆ పాత్రలు చాలా సహజంగా ఉంటాయి.
-హీరోయిన్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ఈ పాత్రకు తను పర్ఫెక్ట్. తనని ఆడిషన్స్ చేసుకొని తీసుకున్నాం.
ఈ సినిమా రన్‌టైమ్ ఎంత?
-రెండు గంటల 17 నిమిషాలు. చాలా క్రిస్పీగా ఉంటుంది. కృష్ణ క్యారెక్టర్‌తో ఆడియన్స్ ట్రావెల్ చేస్తారు. అసలు సినిమా ఎప్పుడు అయిపోయిందా అనిపించేలా కృష్ణ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తాడు.
ఈ సినిమా విషయంలో ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకున్నారా?
-‘అలియాస్ రుక్మిణి’ ఎలాంటి కమర్షియల్ కాలిక్యులేషన్స్ వేసుకోకుండా చేసిన సినిమా. నితిన్ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఇదే చెప్పారు. ఒక మంచి సినిమా చేశాం. కచ్చితంగా ఆడియన్స్‌కు నచ్చుతుందనే నమ్మకం ఉంది.
డిసెంబర్ 4న నాగచైతన్య గారి ‘వృషకర్మ’ కూడా విడుదలవుతోంది కదా ?
డిసెంబర్ 4 నిజానికి చాలా మంచి డేట్. ఆ డేట్లో విడుదలై విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. డిసెంబర్లో ఆడియన్స్ కొంచెం హాలిడే మూడ్‌లోకి వస్తారు. కచ్చితంగా రెండు సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. పైగా ఈ రెండు సినిమాలూ వేర్వేరు జానర్స్‌కు చెందినవి. కచ్చితంగా ఆడియన్స్ రెండు సినిమాలనూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది?
‘ఆకాశంలో ఒక తార’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్‌తో మనం ఇన్వాల్వ్ అవుతూ, వాటిని గుర్తుపెట్టుకుంటాం. ‘అలియాస్ రుక్మిణి’ గుర్తుపెట్టుకునే సినిమా. సినిమా చూసిన తర్వాత రెండు రోజుల పాటు ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ, వారి జర్నీలో భాగమయ్యేలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను.
మీరు నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు?
-ప్రొడక్షన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలి.
మీ ప్రొడక్షన్లో నెక్స్ట్ సినిమా ఏమిటి?
‘కోర్ట్’ ఫేమ్ జగదీష్‌తో ఒక సినిమా ఉండబోతోంది.







