చెస్ ప్రియులకు గుడ్ న్యూస్.. DTA ఆధ్వర్యంలో ‘‘చెస్ టోర్నమెంట్’’
తెలుగు ప్రజలను ఏకం చేయడానికి, వారి బుద్ధికి మరింత పదును పెట్టడానికి డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ‘‘చెస్ టోర్నమెంట్’’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. Think • Strategize • Win) అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.చెస్ ప్రియులకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇదో చక్కటి అవకాశంగా దొరుకుతోంది.
నవంబర్ 22 వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకూ ఈ చెస్ పోటీలను నిర్వహిస్తారు. SV Temple, 26233 Taft Rd, Novi, MI 48374 వేదికగా ఈ పోటీలు జరుగుతాయి.స్విస్ స్టైల్ (Swiss Style)లో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. ఇందులో ఎలిమినేషన్ ఉండదు, కాబట్టి పాల్గొనే ప్రతి ఒక్కరికీ అన్ని రౌండ్లు ఆడే అవకాశం లభిస్తుంది. ఇది అన్‌రేటెడ్ సెక్షన్ (Unrated section) కింద నిర్వహించబడుతుంది.
ఈ పోటీలో పాల్గొనాలంటే సభ్యులకు 15 డాలర్లు, సభ్యులు కాని వారికి 20 డాలర్ల ఫీజును పెట్టారు. ప్రతి విభాగంలో ప్రతిభ కనబరిచిన టాప్ 7 విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ ని కూడా ఇవ్వనున్నారు.ఈ టోర్నమెంట్లో పాల్గొనాలను ఆసక్తి గలవారు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ (QR Code)ను స్కాన్ చేసి లేదా ఆన్లైన్ ఫారమ్‌ను పూర్తి చేసి తమ పేరును నమోదు చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం లేదా రిజిస్ట్రేషన్ల గురించి సందేహాలైతే రాజా తోట్టెంపూడి (Raja Thottempudi) గారిని +1 510 862 6399 నంబర్లో సంప్రదించవచ్చు.







