మెరిసే అందాలతో మాయ చేస్తున్న పాలక్ తివారీ
బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ(Palak Tiwari) తన అందం, స్టైలిష్ లుక్స్‌తో మరోసారి ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో రూపొందించిన స్పెషల్ డిజైనర్ గౌన్‌లో పాలక్ ఎంతో అందంగా కనిపిస్తోంది.

మెరిసే స్టోన్ వర్క్, అద్భుతమైన ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. లాంగ్ బ్రౌన్ హెయిర్, ట్రెండీ ఇయర్ రింగ్స్‌తో పాలక్ తన గ్లామర్‌ను మరింత పెంచింది. బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ ఫోటోషూట్‌లో ఆమె ఇచ్చిన స్టన్నింగ్ పోజులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ ఫోటోల్లో పాలక్ సంప్రదాయ ఆభరణాలకు ఆధునిక మోడ్రన్ టచ్ ఇస్తూ తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కెమెరా ముందు మ్యాజిక్ చేస్తూపాలక్ తివారీ చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.







