టెక్సాస్లోని శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాండ్ దీపావళి సెలబ్రేషన్ 2026’
టెక్సాస్లోని శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాండ్ దీపావళి సెలబ్రేషన్ 2026’ వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 31 వ తేదీన ఉదయం 9 :00 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలను కూడా రూపొందించారు.
ఈ దీపావళి వేడుకల్లో భాగంగా…
ఉచిత ఆరోగ్య శిబిరం :
భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం 9:00 AM నుండి ఉదయం 11:30 AM వరకు హెల్త్ ఫెయిర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఉదయం 9:30 AM నుండి 11:30 AM వరకు వివిధ వైద్య పరీక్షలు (బ్లడ్ ప్రెషర్, ఈకేజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్, మెటబాలిక్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్ ఏ1సీ, లిపిడ్ ప్రొఫైల్, డెంటల్ మరియు ఐ చెకప్, కాంప్రహెన్సివ్ డయాబెటిక్ ఎజామ్) నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత వచ్చే వారికి పరీక్షలు నిర్వహించరు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఉదయం 11:00 AM మరియు సాయంత్రం 6:30 PM గంటలకు లక్ష్మీ పూజ జరుగుతుంది. అలాగే రాత్రి 8:00 PM గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
Cultural & Kids Events :
మధ్యాహ్నం 3:00 PM నుండి 4:00 PM వరకు అభినయ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వారిచే “కల్యాణ రామ” ప్రదర్శన ఉంటుంది.
సాయంత్రం 4:00 PM నుండి 6:00 PM వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
సాయంత్రం 5:00 PM నుండి రాత్రి 8:00 PM వరకు కిడ్స్ కార్నివాల్ మరియు రాత్రి 7:30 PMకి దీపావళి హలోవీన్ పరేడ్ నిర్వహిస్తారు.
వ్యాపార స్టాళ్లు మరియు బాణాసంచా (Vendor Booths & Fireworks):
ఉదయం 10:30 AMకి వెండర్ బూత్ ప్రారంభం. చీరలు మరియు ఆభరణాల స్టాళ్లు ఉదయం 11:00 AM నుండి అందుబాటులో ఉంటాయి. రాత్రి 8:15 PMకి రాఫిల్ డ్రా ఉంటుంది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా రాత్రి 8:30 PMకి భారీ బాణాసంచా కాల్చడం వుంటుంది.
ఆహార విభాగాలు & పార్కింగ్:
ఉదయం 10:00 AM నుండి రాత్రి 9:00 PM వరకు వివిధ రకాల ఫుడ్ బూత్లు అందుబాటులో ఉంటాయి. మెక్ లీన్ & బెయిలీ రోడ్డులోని స్కూల్ లాట్ వద్ద ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడమే కాకుండా, అక్కడి నుండి ఆలయానికి షటిల్ బస్సు సౌకర్యం కూడా వుంటుంది.
ఈ వేడుకలకు సకుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని, అలాగే అందరూ కలిసి పండగ నిర్వహించుకొని, ఆనందోత్సాహాలతో గడపాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.








