తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు ప్రజలందరూ తమ తమ కుటుంబీకులు, స్నేహితులతో హాజరయ్యేందుకు, ఇప్పటి నుంచే తేదీని సేవ్ చేసుకోవడానికి నిర్వాహకులు ముందుగానే దీనికి సంబంధించిన తేదీలను, వేదికను ప్రకటించారు.
‘‘సంక్రాంతి సంబరాలు’’ పేరుతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ వారు జనవరి 9 వ తేదీన ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. Bellingham High school 60, Blackstone st, Bellingham ,MA 02019 వేదికగా ఈ సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం [email protected] వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.








