అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సంస్కృతి… వాల్ట్ డిస్నీ వరల్డ్ పై కూచిపూడి ప్రదర్శన
అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సంస్కృతికి అత్యంత గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. వాల్ట్ డిస్నీ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికపై కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. ఇది అత్యంత చారిత్రాత్మకమైంది. వాషింగ్టన్ లోని మేజికల్ ప్లేస్ గా ప్రసిద్ధి పొందిన ‘‘వాల్ట్ డిస్నీ వరల్డ్’’ లో కొత్త చరిత్ర లిఖించారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అత్యంత శాస్త్రీయ నృత్య రూపకమైన కూచిపూడి ఫ్లోరిడాలోని ‘దివాళీ డాన్స్ ఫెస్ట్’ వేదికపై ప్రదర్శించారు.

ఐకానిక్ నిమో థియేటర్ (Animal Kingdom’s Finding Nemo Theater) లో 1,600 మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో కళాకారులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. గురు డాక్టర్ సాహితి గారు మరియు ‘సాహితి కూచిపూడి కళాక్షేత్రం’ నేతృత్వంలో ఈ కూచిపూడి అంశం అత్యంత వైభవంగా ప్రదర్శించారు. అనూష అనే అమ్మాయి పరమ శివునిగా, ఆర్యవీర్ శ్రీకృష్ణుని వేషధారణలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

అలాగే సుప్రసిద్ధ సాహితీవేత్త, సినిమా రచయిత జొన్నవిత్తుల, ప్రముఖ సంగీత గురువులు రామాచారి దీనిని రూపొందించారు. అలాగే సుప్రసిద్ధ సాహితీవేత్త, సినిమా రచయిత జొన్నవిత్తుల, ప్రముఖ సంగీత గురువులు రామాచారి దీనిని రూపొందించారు. ఇంతటి సుప్రసిద్ధ వేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన జరగడంతో అందరి దృష్టీ ఆకర్షితమైంది. ఇందులో పాల్గొన్న ఆహూతులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.








