మిచిగన్ చాప్టర్ ను ప్రారంభించిన NATS
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తన మిచిగన్ చాప్టర్ ను ఘనంగా ప్రారంభించింది. దసరా వేడుకల్లో భాగగా ఫార్మింగ్టన్ హిల్స్ మనోర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భారీ సంఖ్యలో నాట్స్ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, హితైషులు హాజరయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు,ఐక్యత ప్రతిబింబించేలా ఈ వేడుక సాగింది.
నాట్స్ చైర్మన్ కిశోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, మిచిగన్ చాప్టర్ నేతలు, ఇతర సభ్యుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. శాస్త్రీయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా విశేషంగా జరిగాయి.

ఈ సందర్భంగా భారత్ తో పాటు అమెరికాలో చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అమెరికాలోని వివిధ కమ్యూనిటీ అవసరాల కోసం నాట్స్ 6 లక్షల డాలర్లకు పైగా నిధులు సేకరించినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక.. వివిధ రంగాల్లో తెలుగు పరిరక్షణ కోసం కృషి చేసిన పలువుర్ని నాట్స్ మిచిగన్ చాప్టర్ సత్కరించింది.
మిచిగన్ చాప్టర్ కి కొత్త నాయకత్వ వివరాలు
శ్రీదేవి మనేపల్లి – చాప్టర్ కోఆర్డినేటర్
మాహి బొల్లవరం – జాయింట్ చాప్టర్ కోఆర్డినేటర్
రవి చాలంటి – ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్స్
హేమ సూరపరాజు – ట్రెజరర్
జ్యోతి జవ్వాది – సభ్యత్వ విభాగం
అనుపమ దివాకర్ల – పీఆర్, మీడియా








