అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి అనిత
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత (Anita) విస్తృతంగా పర్యటించారు. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలకు వరహానది (Varaha River) ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, లోతట్టు గ్రామాల ప్రజల అప్రమత్తత, పునరావాస కేంద్రాలకు తరలింపుపై అధికారులతో చర్చించారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. చిన్న గుమ్ములూరు( Chinna Gummuluru), పెద్ద గుమ్ములూరు ( Pedda Gummuluru) తదితర ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్న తీరుపై అధికారులను మంత్రి ప్రశంసించారు. అర్నాబ్ (Arnab) ముప్పు పూర్తిగా తొలగే వరకు అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.








