సహాయక చర్యల్లో పాల్గొనండి .. జన సైనికులకు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి
అర్నబ్ తుపాను ( Arnab Cyclone) ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసైనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. కోస్తా జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపించిందని, చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని పవన్ తెలిపారు. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణశాఖ చెప్పిందన్న ఆయన, తుపాను బాధితులను సహాయక శిబిరాలకు తరలించి ఆహారం అందించాలని సూచించారు. రహదారుల (Roads)పై కూలిన చెట్టు, విద్యుత్ స్తంభాల(Electricity poles) తొలగింపులో సిబ్బందికి సహకరించాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.








