టీడీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే బాలకృష్ణ
త్వరలో జగరబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మున్సిపల్ చైర్మన్ (Municipal Chairman), వార్డు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని, దీనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్యే హిందూపురం (Hindupur) చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజలకు వివరించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించే శక్తి కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) నేతలు చేసిన దౌర్జన్యాలను పట్టణ వాసులు ఇంకా మర్చిపోలేదన్నారు. ప్రస్తుతం శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటైన వెంటనే అభివృద్ధి (Development) కార్యక్రమాలు మరింత జోరుగా చేపట్టిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.








