కేటీఆర్ కు సారీ చెప్పిన కొండా సురేఖ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై గతంతో తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో తానలా మాట్లాడానన్నారు. నిరాధారమైన ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు. కేటీఆర్, కుటుంబసభ్యులను బాధ పెట్టాలని, వారి ప్రతిష్ట (Reputation) కు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు లేదన్నారు. తన వ్యాఖ్యలతో కేటీఆర్, ఆయన కుటుంబసభ్యుల (Family members)ను నొప్పించి ఉంటే చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాని అన్నారు.








