బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
అర్నబ్ తుపాను (Arnab Cyclone ) సృష్టించిన విధ్వంసం మరువక ముందే బంగాళాఖాతం (Bay of Bengal) లో మరో అల్పపీడనం (low pressure) ఏర్పడింది. బుధవారం దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉదయం ఆదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులు (Andaman and Nicobar Islands,), అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని గమనాన్ని డాప్లర్ వెదర్ రాడార్ ద్వారా వాతావరణ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.








