అర్నబ్ తుపాను ఎఫెక్ట్ … త్వరలోనే రాష్ట్రాలకు కేంద్ర బృందాలు : అమిత్ షా
అర్నబ్ తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి (Puducherry) సీఎంలతో మాట్లాడి తుపాను అనంతర పరిస్థితులపై సమీక్షించారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్నామని తెలిపారు. అయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, నష్టం వివరాలను సీఎంలు అమిత్‌షాకు వివరించారు.








