వృషకర్మ ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్!
అక్కినేని నాగ చైతన్య(Akkineni naga chaitanya) హీరోగా నటిస్తున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ వృషకర్మ(Vrusha Karma) పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు మ్యూజిక్ ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు.
సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న అజనీష్ లోక్‌నాథ్(ajaneesh lokanath) స్వరపరిచిన పాటకు సంబంధించిన చిన్న క్లిప్‌ను రిలీజ్ చేస్తూ చిత్రబృందం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. స్వాగ్ ఆఫ్ అర్జున్(swag of arjun) అంటూ సాగే ఈ సాంగ్‌ను ఫస్ట్ సింగిల్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసింది. హీరో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ, అతడి స్టైల్‌ను ప్రతిబింబించేలా ఈ సాంగ్ ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అయితే సాంగ్ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోయినా, తాజాగా అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 4న ఈ సాంగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్న ఈ సినిమాపై నాగ చైతన్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తండేల్(thandel) తర్వాత చైతూ నుంచి వస్తున్న మరో కీలక ప్రాజెక్ట్ కావడంతో వృషకర్మపై ప్రత్యేకమైన అంచనాలున్నాయి. ఫస్ట్ సింగిల్‌తో సినిమా ప్రమోషన్లలో మరింత జోష్ పెరగనుండగా, అజనీష్ మ్యూజిక్, చైతూ స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్ కు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయేమో చూడాలి.
It’s 11:11 🧿
And we are vibing to #SwagOfArjun 🎧🎧🎧
@AJANEESHB 🤩🤩🤩
Announcement soon ❤️🔥❤️🔥❤️🔥
#Vrushakarma GRAND RELEASE ON DECEMBER 4TH, 2026. 🔱 https://t.co/OuPi9enqWW
— Vrushakarma (@Vrushakarma) October 28, 2026








