నాట్స్, డౌన్టౌన్ సిక్స్వెల్ కనెక్షన్ సంయుక్తంగా ‘‘దీపావళి వేడుకలు’’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరియు డౌన్టౌన్ సిక్స్వెల్ కనెక్షన్ (Downtown Sykesville Connection) సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు.
2026 సంవత్సరపు ‘గ్రేట్ అమెరికన్ మెయిన్ స్ట్రీట్ అవార్డు’ను సొంతం చేసుకున్న చారిత్రాత్మక సిక్స్వెల్ నగరంలోని ఓక్లహోమా అవెన్యూలో ఈ వేడుకలు కన్నులపండువగా జరగనున్నాయి.
నవంబర్ 1 వ తేదీన OKLAHOMA AVENUE SYKESVILL, MD 21784 వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకూ జరగనున్నాయి.
ఈ సందర్భంగా దీపావళి ప్రాముఖ్యత మరియు సంప్రదాయాలపై ప్రత్యేక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి, ప్రత్యేక అలంకరణలు మరియు స్థానిక కళాకారుల విక్రయశాలలు (Arisan Vendors) ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.దీపావళి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా క్యాండిల్ మార్చ్ (Candle March) నిర్వహించనున్నారు. హాజరైన వారికి అల్పాహారం కూడా వుంటుంది.
తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను విదేశాలలోనూ భావితరాలకు అందించడంలో భాగంగా NATS సంస్థ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.downtownsykesville.com/indian-culture-celebration లేదా www.natsworld.org సందర్శించవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 1
సమయం : సాయంత్రం 5:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకు
వేదిక : OKLAHOMA AVENUE SYKESVILL, MD 21784
ప్రత్యేక ఆకర్షణలివే…
దీపావళి ప్రాముఖ్యతపై ప్రసంగాలు
2. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి, వేండార్స్
3. దీపావళి ప్రాముఖ్యత చెప్పేలా క్యాండిల్ మార్చ్
4. హాజరైన వారందరికీ అల్పాహారం








