కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో దసరా, దీపావళి సంబరాలకు ఏర్పాట్లు
కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (CATS) ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 1 వ తేదీన, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకూ ఈ వేడుకలను నిర్వహించనున్నారు. John Champe High School, 41535 Sacred Mountain St, Aldie, VA 20105 వేదికగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సంబరాలకు ఎంట్రీ ఫ్రీగానే వుంటుందని, ఎలాంటి రుసుము వుండదని నిర్వాహకులుతెలిపారు.అలాగే కాంప్లిమెంటరీ డిన్నర్ కూడా వుంటుందని ప్రకటించారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వెండార్ షాపింగ్, REVERBZ టీమ్ తో లైవ్ మ్యూజిక్, బహుమతులు, ఫ్యాషన్ షో, ఫోటో బూత్, ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఎంటర్ టైన్ మెంట్ కూడా వుంటుంది. భరద్వాజ్ కొమరగిరి, యుతి హర్షవర్ధన, అభినవ్, వికీ పాలెపు, శ్రీలత ధూళిపాళ, నవీన్, వేదాంత్ బృందంతో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం వుంటుంది.
కేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు రెడీఅవుతున్నారు. ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా, చిరస్మరణీయంగా ఈ ఈవెంట్ గుర్తుండిపోయేట్లు రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనం మన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ఇరుగు పొరుగు తెలుగు వారితో కలిసి హాజరవుదాం.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు https://tinyurl.com/CATS-Diwali26-RSVP వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. అలాగే వేండార్ రిజిస్ట్రేషన్ కోసం https://tinyurl.com/CATS-Diwali26-Vendors వెబ్ సైట్ ను సందర్శించండి.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 1,
సమయం : మధ్యాహ్నం 2:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు
వేదిక : John Champe High School, 41535 Sacred Mountain St, Aldie, VA 20105
ప్రత్యేక ఆకర్షణలు :
FREE ENTRY
🍽️ Complementary DINNER
🎭 Cultural Performances
🛍️ Vendor Shopping
🎶 LIVE MUSIC BY REVERBZ
🎁 Raffles & Prizes
🏆 Special Recognition
💃 Fashion Show
📸 Photo Booth
👨👩👧👦 Family-Friendly Entertainment








