అనిరుధ్- కావ్యా మారన్ పెళ్లిపై జోరుగా ప్రచారం..
సౌత్ సినీ వరల్డ్ లో తనదైన ముద్ర వేసిన అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కో ఓనర్ కావ్యా మారన్(Kavya maran) పెళ్లిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. వీరిద్దరూ నవంబర్‌లో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 11న పెళ్లి, అదే నెల 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డేట్స్ పై అటు అనిరుధ్, ఇటు కావ్యా మారన్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వెలువడలేదు.
ఈ పెళ్లికి సంబంధించి రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని పెంచాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్(Kalanidhi maran), కావేరి మారన్(Kaveri maran) ప్రముఖులను ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) కార్యాలయం ఆహ్వానానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi), తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Joseph vijay)లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే వీరి హాజరుపై క్లారిటీ రావాల్సి ఉంది.
అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్ గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2025లో ఈ డిస్కషన్స్ ఊపందుకోగా, అప్పట్లో అనిరుధ్ వాటిని ఖండించారు. 2026 జూన్‌లో ఆయన మేనమామ వై. జీ. మహేంద్ర(Y.G mahendra) చేసిన కామెంట్స్ మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. జైలర్(Jailer), లియో(Leo), జవాన్(Jawaan), దేవర(Devara), కూలీ(Coolie) వంటి సినిమాలతో అనిరుధ్ గుర్తింపు తెచ్చుకోగా, కావ్యా మారన్ సన్ టీవీ నెట్వర్క్(Sun TV Network), ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ వార్తలపై ఉత్కంఠ కొనసాగనుంది.








